మనుషులు ఎప్పుడూ సంబంధాలను ఏర్పరచుకుంటూ, చెడగొట్టుకుంటూనే ఉంటారు. దురదృష్టవశాత్తు, సంబంధాలు కూడా మనుషులను నిలుపనుగలవు, వారిని పతనం చేయనూగలవు. బానిసత్వాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. కానీ, మనలో చాలా మంది మన మానవసంబంధాలకు స్వచ్చందంగా బానిసలై పోయిన వాళ్ళమే. పరస్పర సంబంధాలలో హెచ్చు - తగ్గులు, ఒడుదుడుకులూ ఎదురయినప్పుడు, వాటి ప్రభావం మన మీద పడుతూనే ఉంటుంది. పొంగిపోవటం, కుంగిపోవటం మధ్య పడుతూ - లేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటాం. శోచనీయమైన విషయం ఏమిటంటే , కృంగిపోయే సందర్భాలు తరచుగాకలుగుతున్నట్లు, పొంగిపోయే సందర్భాలు అతిత్వరగా గడిపోతున్నట్లు అనిపిస్తుంది. అయినా కూడా , మానవుడు ఈ సంబంధాల కోసం తపన పడుతూనే ఉంటాడు. ప్రేమలో భంగిపడి , మనసు విరిగిపోయి ఉన్నవాడు కూడా, మళ్ళి మరొకరి ప్రేమకోసం పరుగులు పెట్టి, అది లభిస్తే సంతోషిస్తూ ఉంటాడు.