'అరమనే' (అంతఃపురం) కుంవిగారి సృజనాత్మకతకు పరాకాష్ఠ. ఇది కన్నడ విషయంలో నవల అనే సాహిత్య ప్రక్రియ నిర్వచనాన్ని, స్వరూపాన్ని ఆమూలాగ్రంగా మార్చివేస్తుంది. ఆధునికతను మేళవించుకుంటూనే, దేశీయకథన పరంపర అయమాలను సంతరించుకుంటుంది. పంతొమ్మిదవ శతాబ్దపు వలస పాలన కిందకి తెచ్చుకున్న విధానాన్ని చాలా భిన్నంగా చిత్రించిన ఈ కృతిలో రాజరికం, బ్రిటిష్ ప్రభుత్వం, శాంభవి, తనకున్న అలౌకిక శక్తుల వినియోగం వల్లనే ప్రజాసంక్షేమంలో నిరతురాలౌతుంది. ఇక్కడి జీవితం తన వివరాలలో, ధోరణులతో సామాన్య ప్రజల ఆశయాలకు, జీవితం పట్ల ప్రేమకు పట్టిన అద్దమైంది. మన తరంలోని అత్యంత ప్రతిభావంతుడైన రచయితలలో ఒకరైన కుంవిగారు ఒక నూతన కథన తంత్రాన్నే రూపొందించుకున్నారు.
- రంగనాథ రామచంద్రరావు