Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అనిసెట్టికి అర్థవంతమైన జేజేలు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి లోకపు సౌభాగ్యానికి లోకపు సౌందర్యానికి నరులంతా వారసులే (అనిసెట్టి) విశ్వవిద్యాలయాల నుండి వెలువడే పరిశోధనా గ్రంథాలలో ప్రచురణ అయ్యేవి చాలా పరిమితం. అలా ప్రచురణ పొందిన వాటిలో రెండోసారి అచ్చయ్యేవి మరీ తక్కువ. ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి “ఆధునికాంధ్ర కవిత్వము : సంప్రదాయములు, ప్రయోగములు” అనేకానేక పర్యాయాలు అచ్చయ్యింది. ఆచార్య ఎస్వీ రామారావు గారి “తెలుగు సాహిత్య విమర్శ- అవతరణ వికాసములు, రెండు మూడు పర్యాయాలు ఏక వర్షిత రూపంలో అచ్చయింది. ఏల్చూరి నారాయణరావుగారి “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం”, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ గారి “తెలుగులో ఉద్యమ గేయాలు", నా చిననాటి స్నేహితుడు ఆచార్య నాగపట్ల భక్తవత్సల రెడ్డి "స్వాతంత్ర్యోత్తర పాలన తెలుగు కవిత్వం” వంటి మరికొన్ని గ్రంథాలు పునర్ముద్రణ పొందాయి. ఈ వరుసలో నా సహ విద్యార్థి డా.పి.వి.సుబ్బారావు పరిశోధనా గ్రంథం "అనిసెట్టి సాహిత్యానుశీలనం” పునర్ముద్రణ పొందడం నాకు ఆనందంగా ఉంది. ఈ మంచి సమయంలో నా మిత్రుడు సుబ్బారావుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సుబ్బారావు నాకు ఎం.ఎ.లో సహ విద్యార్థి. 1970-72 మధ్యలో మేము ఎం.ఎ. తెలుగు చదివాం. అప్పటికే సుబ్బారావు కవిత్వం రాస్తున్నారు. ఉ పన్యాసాలిస్తున్నారు. అప్పటికి నాకు వ్యవసాయం తప్ప ఇంకేమీ తెలియదు. 1972లో ఎం.ఎ. తెలుగు పరీక్ష ఫలితాలు వెలువడిన మరునాడే అధ్యాపకుడిగా చేరినవారు సుబ్బారావు (సి.ఆర్. కళాశాల, చిలకలూరిపేట). అయితే మన సామాజిక వ్యవస్థలోని......... |