Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹140
Description

అనువాదకుడిగా శ్రీశ్రీ

చంది. ఇప్పటికే 'ఆంధ్ర

రేకువిప్పిన రివల్యూషన్ (

కా ల

ఇది 'ఆంద్రీకథనం' (అనువాద కథలు). శ్రీశ్రీ అనువాద సాహిత్యంలో చివరి పుస్తకంగా వెలువడుతోంది. ఇప్పటికే 'ఆంద్రీకవనం' (అనువాద కవిత్వం), లెనిన్ కావ్యం (అనువాద కావ్యం), సంపెంగ తోట, అమ్మా!, నేరమూ శిక్షా!, రెక్కవిప్పిన రివల్యూషన్' (అనువాదనాటికలు), మానవుడి పాట్లు (అనువాద నవల),మొత్తం శ్రీశ్రీ అనువాద సాహిత్యం ఎనిమిది పుస్తకాల య్యాయి. పాశ్చాత్య సాహిత్యాన్ని తెలుగులోకానికి పరిచయం చేసి మహోపకారం చేశాడు శ్రీ శ్రీ

మిసెస్ ఏవియన్ కాలేజీలో నేను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు అప్పటి ఫోర్తు ఫారం విద్యార్థుల్లో ఇంగ్లీషు గ్రామరు చాలా బాగా చెబుతానని నాకు మంచి పేరుండేది అని చెప్పు కున్న శ్రీశ్రీ, ఇంగ్లీషు ఒక ద్వారం-దీని ద్వారా నాకు ప్రపంచంలోని ఎన్నో భాషల కవిత్వపు భవనాలలోనికి ప్రవేశం లభించింది' అంటారు. అలాగే 'ఒక కథ గాని,గీతం గాని, నాటకంగాని ఎంతగానో నన్ను ఆకర్షిస్తేనే తప్ప దాన్ని నేననువదించను'అంటారు తన అనువాద రచనల గురించి శ్రీశ్రీ. ఈ నిబద్ధతే శ్రీశ్రీ అనువాద సాహిత్యం శ్రీశ్రీ సాహిత్యానికి దీటుగా నిలిచింది.

శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం' (21సంపుటాలు) కూర్పరిగా చలసాని ప్రసాద్ (శ్రీశ్రీ అను వాదాలపై) అభిప్రాయాలు రెండు ముక్కలు పాఠకుల కోసం... -

శ్రీశ్రీ అనువాద కథలు అంతకు ముందు శ్రీశ్రీ సాహిత్యం సంపుటాలు(1970)లో వెలువడినై. అన్నీ కలిపి పట్టుమని పదమూడు కూడా లేవు. ఇప్పుడవి రెట్టింపయ్యాయి.

శ్రీశ్రీ ఎక్కువగా విలియం సరోయన్ (అమెరికన్ రచయిత) కథలు అనువదించాడు. సరోయన్ రచనలని తనకు పరిచయం చేసింది శ్రీశ్రీయేనని చలం కూడా చెప్పాడు. సరోయన్ తరువాత మపాసా కథలని ఎక్కువగా అనువాదం చేశాడు శ్రీశ్రీ. ఇటలీ, ఇంగ్లండు, జర్మనీ | లాంటి దేశాల కథా సాహిత్యాన్ని మనకు మచ్చు చూపించాడు శ్రీశ్రీ

మరొక మాట, శ్రీశ్రీ అనువాద రచనలు కూడా మిక్కుటంగానే ఉన్నాయి. వీటన్నిటినీ చదవాలి. మూల రచనలతో వాటిని సరిపోల్చి చూడాలి. అప్పుడే అనువాదకుడిగా శ్రీశ్రీ సతా ఏమిటో మనకు తెలుస్తుంది. అందుకు వీలు కలిగించేలా ఈ సంపుటి...

(చలసాని ప్రసాద్. 'ఆశ అనువాద కథలు ముందుమాట విరసం ప్రచురణ, అక్టోబరు, 1999)

'శ్రీశ్రీ సాహిత్యం , శ్రీశ్రీపై సాహిత్యం రెండో నూరు పుస్తకాల హోరు ప్రణాళిక లో శ్రీశ్రీ సాహిత్యనిధి పదో ప్రచురణ ఇది. శ్రీశ్రీ అభిమానులకీ, శ్రీశ్రీ ప్రియశిష్యులకీ, అభ్యుదయ | సాహిత్య ప్రియులకీ అందరికీ స్వాగతం. శ్రీశ్రీ సాహిత్య ఉద్యమయాత్రలోకి కదలి రండి, కలిసిరండి, పదిమందిని కలుపుకురండి. మీ వంతూ గొంతూ అందించండి.