Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹36

శ్రీకాకుళం, కృష్ణాజిల్లా,

                        డా. ఈమని శివనాగిరెడ్డి -స్థపతి గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని వలివేరు గ్రామంలో 1955లో పుట్టిన శివనాగిరెడి. తిరుపతిలోని శిల్పకళాశాలలో సాంప్రదాయ వాస్తు, ఆలయ శిల్పకళలో నాలుగేళ్ళు శిక్షణ పొంది ఎస్వీ యూనివర్సిటీ నుంచి బికామ్, ఉస్మానియా యూనివర్శిటీ నుండి చరిత్ర, పురావస్తుశాస్త్రంలో ఎం.ఏ., హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో పిహెచ్డి పట్టాలను పొందారు. 1978లో దేవాదాయశాఖలోనూ, 1981 నుంచి రాష్ట్ర పురావస్తు శాఖలోనూ స్థపతిగా పనిచేసి 2013లో పదవీ విరమణ చేశారు.

                       చరిత్ర, శాసనాలు, పురావస్తుశాస్త్రం, పర్యాటకం, బౌద్ధం... వీటి పై అనేక పుస్తకాలు రాశారు. శ్రీశైలం జలాశయం ముంపుకు గురైన క్రీ.శ. 7-17 శతాబ్దాలకు చెందిన 100కు పైగా దేవాలయాలను తొలగించి, ఎగువన పునర్నిర్మించారు. -

                        2004 నుంచి 2008 వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం & హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ లో ప్రొఫెసర్ గా, డీన్ గా, 2010-11లో డైరెక్టర్ గా పనిచేశారు. 2013 నుంచి 2015 ఫిబ్రవరి వరకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ గా, ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ప్రత్యేకాధికారిగా పనిచేశారు. 2015 మార్చి నుంచి మాలక్ష్మీ గ్రూప్ కు చెందిన ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ • అమరావతి సీఈవోగా పనిచేస్తున్నారు.