Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఒక్కటియున్న నింకొకటి యుండదు నేటి కవీంద్రులందు నీ
దృక్కవులందు సర్వ మమరించును దైవము, పాండితీ పరి
సృక్కమనీయ ధారయు వరిష్ఠముగా లలితత్వమున్ గడున్
పెక్కువగాగ నుండిన కవిప్రభు వీయన యంచు చెప్పెదన్!
-కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
తాలను రాగితేకుల పురాతన వాజ్మయ కందరమ్ములన్
మూలుగుచున్న తెగ్గుకథ ముమ్మరపుం బడలోర్చి తీర్చి మేల్
మేలని కోవిదుల్ పొగడ మేటి ప్రబంధముగా సృజించి ని
ర్వేల యశమ్ము గన్న సుకవిన్ గొనియాడెద నిమ్మహామతిన్!
-తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి
ఏ యెపుడో! గ్రహించి లిఖియించితి “గొప్ప కవీశ్వరుండవై
జే యనిపించు కొందువని" చేసితి నన్ ఋతవాది సత్యనా
రాయణశాస్త్రి! కావునను సార్థకమాయెను నీదు పేరు మా
నాయన! నీదు నుత్సవమునన్ తన యుత్సవ మబ్బె వాణికిన్!
-శతావధాని వేలూరి శివరామశాస్త్రి