ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రయోగాలు పేరుతో డివివిఎస్ వర్మగారు రాసిన చిన్న పుస్తకం ఇది.పుస్తకం చిన్నదైనా విశ్లేషణ మాత్రం చిక్కనైనది. కొత్త చూపుతో కొత్త కోణాలను చూపిస్తూ కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. వర్మగారి రచనలకున్న ప్రత్యేకత అది.
గత 70 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ ప్రయోగాలను ఈ పుస్తకం మన ముందుంచుతుంది. ఇందులో పైకి కనిపించే అంశాల పొరలను తొలగించి వాటి నిజ స్వరూపాన్ని వెతికితిస్తుంది.
రాష్ట్ర రాజకీయ పరిణామాలలో మౌలికమైన అంశాలను అర్ధం చేసుకోవడానికి ఉపకరించే ఒక అపురూపమైన విశ్లేషణను ఈ పుస్తకం అందిస్తుంది.
రాష్ట్రంలో ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయాన్నిసాధించాలనుకునే వారికీ ఇదొక కరదీపిక. ఇదొక దీక్సూచి .