Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

నా మాట

ఆ వె॥ దొద్దనరము వారు కొద్దవంశమునందు

ప్రభవమందినాడు! ప్రాజ్ఞులార! నన్నుజనులు, సత్యనారాయణుందంద్రు

సుబ్బరామయాఖ్య సుతుడనేను|| ఉ॥ చిక్కని భావజలములు చేతన గూర్చెడు లోకవృత్తముల్

మక్కువమీరగా నరసి మంజుల శబ్దములేర్చికూర్చియున్ అక్కజమైన రీతి సకలాంధ్ర జనావళి మోదమందగన్ చెక్కితి పద్యశిల్పముల చిత్తమునందున చింతసేయుచున్

- 'గాథాసప్తశతి' క్రీ.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన సంకలన గ్రంథం. సంకలనకర్త హాలుడు, హాలుడు కూడా కొన్ని గాథలను స్వయంగా వ్రాశాడు. ఇతడు శాతవాహన చక్రవర్తి. శాతవాహనులు తెలుగు రాజులు.

హాలుడినే శాతవాహనుడు లేదా శాలివాహనుడు అని కూడా అంటారు. శాలివాహనశకం ఈతని పేరు మీదనే ప్రారంభమైంది. ఈతని ఆస్థానంలో అనేక మంది కవులుండే వారని ప్రతీతి.

గాథాసప్తశతి' మహారాష్టీ ప్రాకృత భాషలో రచింపబడిన గ్రంథం. వెబర్ వంటి పాశ్చాత్య పండితులను సైతం ఈ గ్రంథం ఎంతగానో ఆకర్షించింది. దీనికి కారణం - రెండు వేల ఏళ్ళనాటి జనజీవనం ఈ గాథలలో ప్రతిఫలిస్తుండడమే. క్రీ.శ. ఒకటవ శతాబ్దం నాటికి లోకంలో ప్రాచుర్యంలో ఉన్న కోటీగాథల నుంచి ఏడు వందల గాధలను ఎన్నుకున్నానని హాలుడు స్వయంగా చెప్పాడు. అమాయకులైన వల్లెజనుల మనోహర వ్యవహారములు, | మనోవ్యాపారములూ ఎలాంటి అరమరికలు లేకుండా ఇందులో వర్ణించబడ్డాయి.

మనకు తెలిసినంతవరకు తొలిసారిగా శ్రీనాథుడు 'శాలివాహన సప్తశతి' పేరుతో ఈ గాథలను తెలుగులోకి అనువదించాడు. అయితే రెండు, మూడు పద్యాలు తప్ప పూర్తి గ్రంథం అలభ్యం. ఆధునికులలో శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ !