Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ప్రకృతిలో, మానవ సమాజంలో స్త్రీ సగభాగం. కనుక ఆమెకు ప్రకృతిలో, సమాజంలో హక్కులు బాధ్యతలు పురుషునితో సమానంగా వుండాలె. మానవజాతి సంచార జీవితం నుండి సిర నివాసం ఏర్పర్చుకునే క్రమంలో, స్త్రీ పురుష సంబంధాలలో వచ్చిన మార్పు స్త్రీని రెండవ స్థానంలోకి నెట్టి పురుషుడు తన స్వంత వస్తువుగా చూసే పరిస్థితికి తెచ్చింది. స్త్రీని కుటుంబము, పిలల వరకే పరిమితం చేస్తూ, కథలు, పురాణాలు, ఇతిహాసాలు, సాంప్రదాయాల ద్వారా ఒక బానిస మనస్తత్వానికి అలవాటు చేసి, తన చుట్టే తిరిగే బొమ్మలాగా తయారు చేసుకున్నాడు, చేసుకుంటున్నాడు. స్త్రీని మానసికంగా, శారీరకంగా బలహీనురాలిని చేసి ప్రకృతి సిద్ధంగానే స్త్రీ బలహీనురాలు అని చెప్తూ తనను తాను ఒక న్యూనతా భావానికి గురయ్యే పరిస్థితి కల్పించింది. ఈ పితృస్వామ్య సమాజం.