"ఏ వ్యక్తియొక్క వ్యక్తిత్వమైన అతడు సంఘము పట్ల ప్రదర్శించే ప్రవర్తనతో నిర్ణయించకూడదు. లోతుగా అతని ప్రవర్తన తెలుసుకున్ననాడే అతని నిజస్వరూపం బయట పడుతుంది. లోకంలో మానవులంతా తమ స్వార్ధం కోసం, ఎదుటివారిని లోబరచుకోవాలనే ప్రయత్నంతో అనేక విషయాలు మాట్లాడుతుంటారు. ఆ వ్యక్తులనే ఇతరులెవరైనా సహాయాన్నర్దించినప్పుడు వారు మాట్లాడే మాటలని బట్టి ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం మంచిది." అద్భుతమైన మనోవిశ్లేషణలతో దేశ భక్తిని రంగరించిన ఈ "ఆనందనిలయం" అందరూ తప్పక చదవాల్సిన నవల.
-యర్రం చంద్ర శేఖరం.