Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ముందుమాట
మనం ఆంధ్రులం. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మన రాష్ట్ర చరిత్ర, మన చరిత్ర.
ఆంధ్రుల ప్రసక్తి ప్రప్రథమంగా ఐతరేయ బ్రాహ్మణంలో కన్పిస్తుంది. ఐతరేయ బ్రాహ్మణం క్రీ. పూ. 1500-1000 కాలం నాటిది. నాటి నుండి అంటే నేటికి సుమారు 3500 సంవత్సరాలనాటి నుండి వివిధ గ్రంథాలలోనూ, శాసనాలలోనూ, ఆంధ్రుల ప్రసక్తి ఉంటూనే ఉన్నది.
ఆంధ్రులు స్థాపించిన ప్రప్రథమ సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. శాతవాహనుల పాలనతోనే ఆంధ్రప్రదేశ చరిత్రలో చారిత్రక యుగం ప్రారంభ మవుతున్నది. శాతవాహన సామ్రాజ్య స్థాపన క్రీ.పూ. 230లో జరిగింది. అంటే నేటికి 2230 సంవత్సరాల లిఖిత చరిత్ర మనకు ఉన్నది.
అధ్యయన సౌలభ్యం కోసం ఆంధ్రదేశ చరిత్రను అనేకమంది చరిత్రకారులు అనేక విధాలుగా విభజించారు. ఒక్కొక్క విభాగాన్ని 'యుగం' అన్నారు. 'యుగం' అనే మాటకు వేరే అర్థాలున్నా చరిత్రకారులు 'కాలం' అనే అర్థంలోనే ఈ మాటను ఉపయోగించారు. చరిత్ర రచనలో యుగవిభజన చరిత్రకారుల అభిప్రాయాలను బట్టి, అభిరుచిని బట్టి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రకూడా ఇందుకు మినహాయింపు కాదు.
దేశాన్ని పాలించిన రాజవంశాల పేర్లతో యుగవిభజన చేయటం చరిత్ర రచనలో ఒక సంప్రదాయం. ఆ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రను తొమ్మిది
యుగాలుగా విభజింపవచ్చును. అవి : 1) శాతవాహన పూర్వయుగం 2) శాతవాహన యుగం 3) శాతవాహనానంతర యుగం 4) తూర్పు చాళుక్యయుగం 5) కాకతీయ యుగం 6) కాకతీయానంతర యుగం 7) విజయనగర యుగం 8) కుతుబ్ షాహీ యుగం 9) ఆధునిక యుగం................