ఎప్పటిలాగానే ఈ పుస్తకంలో కూడా ఉన్నవి కొన్ని కథలు - అంటే కాస్త వాస్తవం, మరి కాస్త అవాస్తవాలు కలబోసి వ్రాసినవి, మరికొన్ని ఆయా సందర్భాలని బట్టి వ్రాసిన కమామిషులు.... అంటే వ్యాసాల లాంటివి అన్నమాట. ఎప్పటిలాగానే ఇవన్నీ మా కాంతి & కిరణ్ ప్రభ పదేళ్ళకి పైగా నిర్వహిస్తున్న జాలపత్రిక కౌముది. నెట్ లో గత రెండున్నర సంవత్సరాలలో నెలకి ఒకటి చొప్పున ప్రచురించబడినవే. అప్పుడప్పుడు వచ్చే అరా, కోరా, స్పందనలని బట్టి వాటికీ పాఠకుల దగ్గర నుండి అఖండమైన ఆదరణ లభించింది ఒన్ అని భుజాలు ఎగరేసుకోవచ్చును కానీ, నిజానిజాలు పాఠకులకే ఎరుక. ఎందుకంటే చదివిన వారిలో ఒక శాతానికి మాత్రామే మంచి మాటో, కోతి మాటో వ్రాసి కామెంట్ పెడతారు అని ఎక్కడో చదివాను.