Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
డా|| కత్తి పద్మారావు
గ్రామాల జీవన వ్యవస్థలకు మహర్లే పునాది వేశారు. అనేక సందర్భాలలో వచ్చిన మహర్ల ఉద్యమాలు మహారాష్ట్ర సంస్కృతిలో, పరిణామంలో భాగంగా నిలిచాయి. మహర్లు శక్తివంతమైన
జాతి, అతి ప్రాచీనకాలం నుండి వారి ఉనికి భారతదేశ మూలల్లో వుంది” అని నిరూపించాను ఇందుకు అనేక గ్రంథాలు | చదివాను. భారతదేశంలో మహర్లు శక్తివంతమైన జాతి. అంబేడ్కర్ లోని ఆ ధైర్య సాహసాలు వారి నుండి వచ్చినవే. అంబేడ్కర్ ఆత్మగౌరవం మహర్ల నుండి సంతరించుకున్నదే.
మహర్లలో ఈ ఆరు గుణాలు ఉన్నాయి. -
1. మహర్ అనే పదం నుంచి మహారాష్ట్ర ఏర్పడింది.
2. ఒకప్పటి 'మల్ల' రాష్ట్రం క్రమంగా మహరాష్ట్రమైంది.
3. ఆ ప్రజలకు నాటి నుండి నేటి దాకా ఆరాధ్యదైవమైన మల్లారి ఖండి పేరు నుంచి ఈ పదం ఏర్పడినది.
4. 'రసిక' అనే జాతి ప్రజల పేరు సంస్కృతీకరణ చెంది రాష్ట్రంలో దాని నుంచి రఠిక, మహరాష్ట్ర ఉత్పన్నమైనాయి.