'ఈ పుస్తకం రాజ్యాంగం పై వచ్చిన సాహిత్యానికి ఆసక్తికరమైన జోడింపు. అంబెడ్కర్ పైనా, దళితుల హక్కుల కోసం అయన జీవితపర్యంతం సాగించిన పోరాటం మీదా, గాంధీ, పటేల్ తో ఆయన పడిన ఘర్షణల మీదా కొత్త వెలుగును ప్రసవింపజేసింది. రాజ్యాంగ నిర్మాణ సభ రెండు సంవత్సరాలు శ్రమించి ప్రపంచంలోనే అత్యంత గొప్పదిగా పరిగణించే రాజ్యాంగాన్ని ప్రసాదించింది. కానీ దీనికి బీజాలు మూడు దశాబ్దాల కిందటే పడినాయని చాలా కొద్దిమందికి తెలుసు. తరచుగా మనస్తాపం కలిగించే నాటి ఆవేశాన్ని, ఆసక్తిగా పట్టి చూపించే ప్రయత్నం రాజశేఖర్ వుండ్రు చేసారు. మన ఎన్నికల వ్యవస్థ పరిణామక్రమం పైన వచ్చిన పరిమిత సాహిత్యానికి ఈ పుస్తకం పొడిగింపు.
- రాజశేఖర్ వుండ్రు