శాంతి ప్రబోధ కథలలో మధ్య తరగతి స్త్రీల సమస్యలు ప్రధానంగా బైట సమాజంలో స్త్రీల హక్కులకు, లైంగిక వివక్షకు, విధింపులకు, అత్యాచారాలకు సంబంధించినవి. అయితే అవి సమస్యలను చిలవలు పలవలుగా వర్ణించటానికి పరిమితమైన అయ్యో.... అయ్యయ్యో కథలు మాత్రం కావు. మార్పు కోసం ఎవరి పరిధుల్లో వాళ్లు పని చేయగల సంసిద్ధతను అభివృద్ధి చేసుకోవాలని చెప్పే కథలు. బాధిత స్త్రీలలో రావలసిన చైతన్యం గురించి చెప్పటం ఒక పార్శ్వం అయితే, వాళ్ల కోణం నుండి సమస్యను అర్థం చేసుకొని, వాళ్ల కోసం ఆలోచించగల, పని చేయగల దిశగా పురుషులు ఆత్మ విమర్శతో, కొత్త చైతన్యాన్ని అభివృద్ధి చేసుకొనవలసిన అవసరాన్ని గుర్తుచేయటం మరొక పార్శ్వం.
- వి. శాంతిప్రబోధ