Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
రచయిత మాట
అల్లూరి సీతారామరాజు నాయకత్వాన్న మన్య ప్రజల వీరోచిత తిరుగుబాటు 1920 దశకంనాటి మాట. తరువాత దేశంలో స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు విప్లవాలు జరిగాయి. అహింస ద్వారా స్వాతంత్ర్యాన్ని మేమే తెచ్చాం అని కాంగ్రెస్ వారు అంటున్నారు. కాదు మేమే నిజమైన వారసులమని బిజెపి, ఆర్ఎస్ఎస్ వాళ్లు వాదిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తరువాత నేడు 2022లో మనం వున్నాం. స్వాతంత్ర్యం సాధించింది ఏమిటి? అని ఎవరైనా ప్రశ్నించుకుంటే దిక్కులు లెక్కపెట్టే స్థితిలో వుంది నేటి పరిస్థితి. అన్ని రంగాలలోనూ అన్ని తరగతులకు చెందిన ప్రజలలోనూ సమస్యలే. కళ్ళున్న వారికి ఎవరికయినా కనిపిస్తుంది నేటి భారతి దీనావస్థ (పాలకులకు తప్ప) నాటి స్వాతంత్ర్య సమరయోధులు ఆశించిన స్వరాజ్యం ఇదేనా? ఎప్పటికీ కాదు. నాడు సీతారామరాజువంటి విప్లవవీరులు, అనేకమంది సమరయోధులు ఆశించినది ఈనాటి తరహా భారత్ను కాదు. అలనాడు మన్య ప్రజలు మొత్తంగా పీడన నుంచి విముక్తి కావాలనీ, మన్య ప్రజల విముక్తి భారత ప్రజల విముక్తికి నాందీవాచకం పలకాలనీ సీతారామరాజు ఆశించాడు. స్వాతంత్ర్యం వచ్చింది. మన్య ప్రజల పరిస్థితి ఇంకా అద్వాన్నంగానే వుంది. భారత ప్రజల పరిస్థితి సరేసరి. రోజూ మనం అనుభవిస్తూనే వున్నాం. ప్రజానీకంలో ఇంకా 70 శాతం ప్రజలు బీదరికంలోనే వున్నారు. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, నిరుద్యోగ సమస్య, దివాళా తీస్తున్న రైతాంగం మనను చుట్టుముట్టాయి. మరో పక్క పాలక బిజెపి ప్రభుత్వం మతతత్వాన్ని ఎగదోసి దేశాన్ని చీల్చి అరాచక, రాజకీయం చేస్తోంది. ప్రజలు కష్టంతో సృష్టించిన సంపదని అంతా కొద్దిమందికే దోచి పెడుతోంది...........