పట్టణంలో కోలాహలం మొదలైయింది.
ఉదయ కాంతులు మెల్లిగా విచ్చుకుంటున్నాయి.
గోడమీద ఎలక్ట్రానిక్ గడియారం ఐదు గంటల్ని సూచిస్తూ సంగీతం వినిపించింది.
బయట వీచిన గాలికి కిటికిరెక్కలు టప్ - టప్ మంటూ మ్రోగాయి. తన గదిలో పడుకుని నిద్రిస్తున్న ఉదయ్ కి ఒక్కసారిగా మెలకువ వచ్చింది.
ప్రతిరోజూ ఏడుగంటలు దాటితేతప్ప మెలుకువ రాదు.
చేస్తుంది జర్నలిస్ట్ వృత్తి. వార్తలను సంచలనంగా పత్రికలకు పంపగలడని, ప్రస్తుత రాజకీయాలమీద చక్కని విస్లషణాత్మకమైన వ్యాసాలు వ్రాయగలడని అతనికి అతని అనుచర్లుల్లో మంచి పేరే వుంది.
-బొల్లిముంత నాగేశ్వరరావు.