ఈ రోజుల్లో చాలామంది ఏలీయనేషన్ గురించి విని వుంటారు. ఆ మాట వినియోగించి ఉంటారు. చాలామంది చాలా సిద్ధాంతాలు చెప్పినా మర్క్స్ ఏలీయనేషన్ సిద్ధాంతం అన్ని విమర్శలకు తట్టుకుని నిలిచింది. పరాయీకరణ భావన మర్క్స్ పేరుతో ముడిపడి పోయింది. ఆ సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం.
మానవత్వం " అలంకారం" కాదు . అది మన ఆయుధం. మన మానవత్వాన్ని మనకు కాకుండా చేస్తున్న పరాయీకరణకు వ్యతిరేకంగా మానవత్వం కోసం, మానవత్వాన్ని ఆయుధంగా పూని పోరాడుదాం. ఉత్పత్తి రంగం నుండి జనించే పరాయీకరణకు వ్యతిరేకంగా జరిగే రాజకీయ పోరాటానికి పక్కనే, దానికి మద్దతుగా సాంస్కృతిక, భావజాల పోరాటం జరపవలసి ఉంది. ప్రేమించడం మానవ స్వభావంలో ముఖ్య భాగమని మర్క్స్ పేర్కొన్నాడు.