Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹600

                      ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ ఆకెళ్ళ'గా సుప్రసిద్ధులైన ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ స్వస్థలం కాకినాడ. కథారచయితగా - వివిధ వార, మాస పత్రికల్లో రెండు వందలకు పైగా కథలు రాయడం జరిగింది. ఇందులో 26 కథలు కన్నడ, హిందీ, తమిళ భాషల్లోకి అనువదించారు.

                       నవలా రచయితగా -విశాలాంధ్ర అవార్డు, ఆంధ్రప్రభ అవార్డు, యువ చక్రపాణి అవార్డు, విజయ మాస పత్రిక అవార్డు (రెండుసార్లు) గెలుచుకున్నారు. 'విద్యారణ్యం' అనే నవల హిందీలోకి, 'వ్యవస్థ' అనే నవల కన్నడం లోకి అనువదించబడ్డాయి. 'ధర్మోరక్షతి రక్షితః' అనే ఆంధ్రపత్రిక సీరియల్ ఎందరో మేధావుల ప్రశంసలు పొందింది.

టి.వీ. సీరియల్ రచయితగా - 'నారీయాగం ' (సీరియల్ కథా రచయితగా), పల్లెవాసం - పట్నవాసం' (సీరియల్ కి మాటల రచయితగా) “నీలో సగం' (సీరియల్ కి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా) నంది అవార్డులు పొందేరు.

                      సినీరచయితగా - మొదటి చిత్రం 'మగమహారాజు' నుంచి ఇప్పటి వరకు ఎనబై చిత్రాలకు పైగా రచన చేయడం జరిగింది. ఇందులో 'స్వాతిముత్యం', 'శృతిలయలు' వంటి జాతీయ అవార్డులు పొందిన చిత్రాలు, 'ఆడదే ఆధారం' వంటి రాష్ట్ర బహుమతి పొందిన చిత్రాలు ఉన్నాయి. 'సిరివెన్నెల', 'శ్రీమతి ఒక బహుమతి', 'నాగదేవత', 'ఇల్లుఇల్లాలు- పిల్లలు', 'ఓ భార్యకథ', 'అంతఃపురం', 'చిలకపచ్చ కాపురం', 'ఆయనకిద్దరు' లాంటి విజయవంతమైన చిత్రాలున్నాయి. 'అయ్యయ్యో బ్రహ్మయ్య' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

                    నాటక రచయితగా - 'అమ్మ', 'రేపటి శత్రువు' తో మొదలు పెట్టి 30 నాటికలు రాశారు. పద్య నాటకాలతో కలిపి దాదాపు 35 నాటకాలు రాశారు.

                    పద్య నాటకానికి, సాంఘిక నాటకానికి, నాటికలకూ,  పిల్లల నాటికలకీ - మొత్తం 13 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతులు పొందేరు. మొత్తం అన్ని రంగాల్లో 16 సార్లు నంది బహుమతులు పొందేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని కళారత్న (హంస అవార్డుతో సత్కరించింది......

                     ఆకెళ్ల రచనలు సామాజిక జీవితానికి దివిటీలు. మనిషిలోని స్వార్థం, దుష్టత్వం , అనైతికతలాంటి దిగజారుడు తనాన్ని వేలెత్తి చూపుతూ, మనిషిలో ఉండవలసిన ఔన్నత్యాన్ని, మానవత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తారు. సంఘజీవిగా మనిషి ఎలాంటి వలు కలిగివుండాలో, సమాజాభ్యున్నతికి ఎలా దోహదపడాలో తన రచనల ద్వారా ఎలుగెత్తి చాటుతారు.