Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹175

గత మూడు వారాల్లో సంభవించినన్ని సంతోషప్రదమూ, సంభ్రమజనకమూ అయిన సంఘటనలు కోల్యా పూజి కొవ్ మొత్తం జీవితంలోనే మరెన్నడూ జరగలేదు. నికొలాయ్ పెత్రోవిచ్ పూజ్నికోవ్ అనబడే తనకు, లెఫ్టినెంటు హోదానిస్తూ ఆజ్ఞ జారీకావడం వాటిలో మొదటిది.

ఈ ఆజ్ఞ చదవబడిన ఉదయపు పెరేడ్ అనంతరం వాళ్లందర్నీ నేరుగా స్టోర్సుకి తీసుకుపోయారు. అది మామూలు కాడెట్ స్టోర్సు కాదు, ప్రత్యేక స్టోర్సు. అతి నాజూకైన

క్రోమ్ చర్మపు టాప్ బూట్లూ, వాటితో బాటు కిర్రు కిర్రుమనే షోల్డరు బెల్టూ, బిర్రుగా వున్న రివాల్వరు హోస్టరూ, నున్నగా వున్న మ్యాప్ కేసులతో కూడిన కమాండర్ల చేతిసంచీ, ఒక ఓవర్‌కోటూ, చక్కని గుడ్డతో కుట్టిన సైనిక కోటూ జారీచేసిన ప్రత్యేక స్టోర్సు అది. అప్పుడిక మొత్తం బృందమంతా యూనిఫారాలు తమ ఎత్తుకీ, నడుములకీ

సరిపడేలాగా, ఒంటినంటి వుండే కవచాల్లాగా సరిచేయించుకునేందుకని స్కూలు దర్జీ దగ్గరకి దౌడు తీశారు. ఒకళ్లనొకళ్లు నెట్టుకుంటూ, త్రోసుకొంటూ, పైకప్పుకి వ్రేలాడే ఎనామెల్ లాంపు షేడ్లు ఊగిసలాడ నారంభించేటంత బిగ్గరగా నవ్వారు.

ఆ సాయంత్రం మిలిటరీ స్కూలు కమాండరు తనను అభినందించి, రెడార్మీ కమాండర్ అనే గుర్తింపు కార్డునూ, బరువైన పిస్తోలునూ తనకు అందజేశాడు. నూనూగు గడ్డాలూ, మీసాలూ కలిగిన నవ యువకులైన లెఫ్టినెంటులు తమతమ పిస్తోళ్ల నంబర్లను అరిచి చెప్పి, పొడిగా వున్న జనరల్ చేతిని తమ చేతులతో ఉద్రేకంగా నొక్కారు. విందు భోజనం దగ్గర కాడెట్ ప్లటూన్ల కమాండర్లను తమ చేతులపైన పైకెగరేశారు, సార్జెంట్ మేజర్ని ఓ దరువు వెయ్యాలని కూడా పథకాలు వేసుకున్నారు. కాని అన్నీ సజావుగా ముగిశాయి. ఆ సాయంత్రం, అన్ని సాయంత్రాల్లోకీ అత్యద్భుతమైన ఆ సాయంత్రం, సముచితమైన చక్కని తతంగంతో ఆరంభమైన ఆ సాయంత్రం చక్కని తతంగంతో ముగిసింది.

ఆ విందు తదుపరి రాత్రే లెఫ్టినెంట్ ప్లూజ్నికోవ్ తను పైనుంచి కిందిదాకాతన తోలు షోలరు బెల్లూ, ముడతల్లేని తన యూనిఫారమూ, మిలమిల మెరిసే తన టాప్ బూట్లూ - కిర్రుకిర్రుమంటున్నట్లు కనుగొన్నాడు. కిర్రుమనడమే కాదు, కొత్త రూబులు నోటులాగ- అప్పట్లో కుర్రాళ్లు వాటిని "పెళపెళలు” అంటూండేవారు - పెళళలాడాడు.