Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
శ్రీలంక, యాళ్వాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞాన శాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్ అకౌంటం గానూ, ఇంగ్లండ్లో మేనేజ్ మెంట్ అకౌంటంటే గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగ నిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్య సమితిలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలూ, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి 'అక్క ఎన్నో బహుమతులు గెల్చుకుంది.
ఎ. ముత్తులింగం
అప్పటిదాకా కలిసున్న మనుషులు మధ్యలో ఒక ఊహా రేఖ గీయగానే అటూ ఇటూ చేరి కొట్టుకుచావడం మనం చూస్తుంటాం. మ్యూజియంలో ఆయుధాల గదిని చూసి, చంపడానికి ఇన్ని ఆయుధాల్ని సృష్టించిన మనిషి ప్రేమించడానికి ఒక్క ఆయుధాన్ని సృష్టించలేకపోయాడని వాపోయిన ఇక్బాల్ చంద్ కవితని గుర్తుచేసుకోవడం ఇక్కడ అవసరం. అయితే లోకంలో ఇంకా నిన్నూ నన్నూ బతికిస్తున్న ప్రేమ మిగిలే ఉందనడానికి నిదర్శనంగా, ఎప్పుడో అరుదుగా ఇలాంటి కథలు చదవగలుగుతాం.
- మూలా సుబ్రహ్మణ్యం
ఈ కథల్లోనివి ఎంతో వైవిధ్యమున్న పాత్రలు. నుస్రత్ ఫతే అలీఖాన్ కచేరీని దర్శించలేకపోయానని ఏడ్చే ఓ పేద కళారాధకుడు, ఆత్మాభిమానాన్ని ధరించి ప్రదర్శించే శక్తి లేని పాత్ర, అందగత్తెగానో జాణగానో కాక సాటి మనిషిగా తనను చూసినందుకే కృతజ్ఞతతో నిండిపోయే పాత్ర, పాకిస్థాన్లో భారతీయ సినిమా తారల తళుకుల గురించీ పాటల మోత గురించీ ఒక లంకేయుని కథలో ప్రస్తావన; పెషావర్, ఇస్లామాబాద్లో సూక్ష్మ వర్ణన సామాన్యంగా ఒకేచోట దొరకనివివి.
- రానారె