Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కోరిన వారల కెల్లను జేరువ కైవల్య పదము శ్రీవరుని మదిం భాగవతము -షష్ఠస్కంధము. (అజామీళోపాఖ్యానము) ఒకించుక సూక్ష్మ పరిశీలనమొనరించిన - ప్రహ్లాదుడు మహా జ్ఞానియని తోపకమానదు. చదువులలోని మర్మమెల్ల-ఉపనిషత్సారమును గ్రోలినవాడు కావుననే పండ్రెండు లక్షణములు గల ఆత్మ తత్వమును తోడి విద్యార్థులకు ప్రబోధమొనరించినాడు. ఆత్మ అన్నింటి యందును ప్రకాశించుచు, అన్నింటి కతీతముగా నుండుటను వివరముగ తెలిపినాడు. వెయ్యేల, శ్రీహరిని చూపగలవా యని తండ్రి ప్రశ్నించినపుడు చక్రి సర్వోపగతుడని సవాలు చేసినాడు. ఎచట బట్టిన నచట భగవంతుని చూపగల మాహాత్మ్యము జ్ఞానులకే చెల్లును. అది యెంతటి భక్తునకైనను సాధ్యము కాని పని. భగవద్గీతయందలి విభూతి యోగము జ్ఞానుల కనుసన్నల వెలుగు చుండును. -
|