ఈ ఆరోగ్య వ్యాస సంపుటి గృహిణులనుద్దేశించి వ్రాయబడింది. పురాణాల్లో నలభీములు ప్రసిద్ధి కెక్కిన పాక శాస్త్ర ప్రవీణులైనప్పటికీ, నాటికీ, నేటికీ ఇంటిల్లిపాదికి ఆహారం సమకూర్చేది గృహిణులు మాత్రమే. మన ఆరోగ్యం మనం తీసికొనే ఆహారం పై ఆధారపడి వుంది కాబట్టి ఆ బాధ్యతను నిర్వహిస్తున్న గృహిణికి ఆరోగ్యానికి దోహదపడే ఆహారం పై అవగాహన అత్యంత ఆవశ్యకం. అట్టి అవగాహనా గృహిణులకు కల్పించాలనే సంకల్పం తోనే ఈ ఆరోగ్య వ్యాస సంపుటి వారికి అంకితమివ్వబడింది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే కుటుంబాల సముదాయమైన దేశం యావత్తు ఆరోగ్యంగా ఉంటుంది గదా!
- ఐ. వెంకటేశ్వర్లు