Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

                     పరమేశ్వరుడి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే అయిదు ముఖాల నుండి వివిధ ఆగమములు ఆవిర్భవించి మానవుడి మోక్ష సాధనకు మార్గనిర్దేశనం చేస్తున్నాయి.
                     ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతంపై కొలువుదీరి కూర్చున్న సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి మోక్షమారాన్ని చూపించే పద్ధతిని ఉపదేశించమని ప్రార్థించగా అప్పుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించినవే ఈ ఆగమములు!

                     పరమేశ్వరుడి పాదం మొదలు శిరస్సు వరకు ఉన్న ఒక్కొక్క భాగానికీ ఒక్కో ఆగమం ప్రతీక అని 'కామికాగమం' వర్ణిస్తూ ఆగమమంటే సాక్షాత్తు పరమేశ్వరుడే అనే భావాన్ని నిరూపిస్తోంది. ఆగమములు అభ్యుదయ మార్గాన్ని చూపిస్తాయని 'తత్త్వ వైశారదీ' గ్రంథం తెలుపుతోంది. ఆధ్యాత్మిక తత్త్వాన్ని బోధిస్తూ జీవనయానాన్ని సరైన రీతిలో నడిపించే విధంగా ఆగమములు ఉపకరిస్తాయని 'సూక్ష్మాగమం' కీర్తిస్తోంది.

                     ఆలయం నిర్మించి అందులో మూర్తిని ప్రతిష్టించింది మొదలు నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు,మాసోత్సవాలు, కళ్యాణోత్సవాలు, ఇలా ఎన్నో ఉత్సవాలు ఆయా సమయానుగుణంగా జరగవలసిందే. ఆ క్రతువులను, వాటి కాలాలను తెలిపేది ఆగమమే! ఉత్సవాల్లో ఏరోజు ఏ వాహనంపై ఉత్సవమూర్తులు ఊరేగాలనేది నిర్దేశించేది ఆగమాలే! ఆలయానికి, ఆలయంలోని మూర్తికి పుష్టిని కలిగించే కుంభాభిషేకాదులు, ఆలయ నిత్యార్చనలో జరిగే లోటుపాట్లను సరిదిద్దేందుకు ఉద్దేశించిన ప్రాయశ్చిత్తాదులు మొదలైనటువంటి వాటికన్నింటికీ ఆయా ఆగమాలే మూలాధారం. ఏయే సమయాల్లో ఏయే క్రియలను చేయాలో ఈ ఆగమములలో చెప్పబడినందున ఆలయ నిర్వహణలో ఆగమములు విడదీయలేని ఒక భాగం. సర్వవిద్యలూ, కళలూ, ఆగమానికి అనుబంధంగా విలసిల్లుతున్నాయి.

                     ఆగమములు తత్త్వజ్ఞానాన్ని మాత్రమే కాక ఉపాసనాది క్రియలను కూడా తెలిపి జీవులకు ముక్తిని ప్రసాదించే కర్మజాన సముచ్చయక భోదములు. కాబట్టి ఇవి అందరికీ ఆచరణీయమైనవి.