Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
శైవాగమాలు
కృతయుగంలో శృతిని అనుసరించి, త్రేతాయుగంలో స్మృతులను అనుసరించి, ద్వాపరయుగంలో పురాణములను అనుసరించి, కలి
యుగంలో ఆగమాన్ని అనుసరించి భగవంతుని ఆరాధించమని జ్ఞానార్లవతంత్రం చెప్పింది. పరమేశ్వరుడి ముఖముల నుండి ఆవి ర్భవించి, పార్వతీదేవికి ఉపదేశించబడి, విష్ణువుచే సమ్మతించబడి | నవి ఆగమాలు అని కామికాగమం చెప్పింది.
సాక్షాత్తు శివుడిచే ప్రబోధించబడినవి కనుక శైవాగమాలు అని కొందరు, శైవపారమ్యాన్ని తెలిపేవి కనుక ఆ పేరు వచ్చిందని ఇంకొందరు చెప్పారు. శివుడు ఉపదేశించినవి ఆగ మాలనీ, దేవిచే ఉపదేశించబడినవి తంత్రాలని మరికొందరు చెప్పారు. ఎవరెన్ని చెప్పినా ఆగమాలు సాక్షాత్తూ శివుడిచే చెప్పబడినవి. ఆగమవాక్యాన్ని వేదవాక్యంతో సమానంగా ఆచరించాలని వీటిని రెండింటినీ వేరువేరుగా చూడలేమని అప్పయ్యదీక్షితులవారు తమ శివార్కమణిదీపికలో రాశారు.
ఆగమాల ఆవిర్భావం కైలాసపర్వతంపై సకలదేవతా మునిగణాల నడుమ లోకహితం కోరి, మోక్షం కోరే మునుల గురించి, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఆగమాలను ఉపదేశించాడు. కలియు గంలో పరమేశ్వరుని చేరాలనుకునే భక్తుల కోసం ఈ ఆగమాలు మార్గం చూపుతాయి. అవి 4 పాదాలుగా విభజించబడ్డాయి...........
15 కందుకూరి వేంకట సత్య బహ్మాచార్య