నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ శాఖకు చెందిన అన్ని విధానాలను ఏకపక్షంగా ఉల్లంఘించింది. భారత వైమానిక దళానికి అవసరమైన యుద్ధ విమానాలను దాదాపు మూడో వంతుకు తగ్గించింది. అంతేకాక అనుభవం కల ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రక్కన బెట్టి అప్పుల్లో కూరుకుపోయిన ఒక అనుభవం లేని ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
రవి నాయర్ ఈ కథనాన్ని తొలిసారి వెలుగులోకి తెచ్చిన స్వతంత్ర జర్నలిస్టు. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సంబంధించిన వివాదంతో ముడిపడి ఉన్న అనేక అంశాలను అయన మనకు కళ్లకు గట్టేలా నిశితమైన విశ్లేషణతో వెల్లడించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ద్వారా జాతీయ భద్రతతో రాజీపడడం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక్షంగా తలదూర్చడం, మొదలైన పరిణామాల పై అయన పలు కీలక ప్రశ్నల్ని సంధించారు.
-రవి నాయర్.
-ఏ.కృష్ణారావు.