గొత్తికోయలయినా కోయిలయినా ఆదివాసులలో మిలిటెన్సీ ఎక్కువ. దానిని ఇరుపక్షాల నాయకులూ నిర్మొహమాటంగా వాడుకుంటున్నారు. తమ ప్రత్యర్థులుగా భావించిన వారిపైన మూకుమ్ముడిగా దాడి చేయడానికి, గొర్రెలను నరికినట్టు నరకడానికి ఆదివాసులు వెనకాడరు. ఈ గుణాన్ని అటు స్వలాజుడం నాయకులు, ఇటు మహాయిస్తూ నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారు. వాడుకుంటున్నారు. "వాళ్లు చేస్తున్నారు కాబట్టి మేము చేయక తప్పదు." అని ఇద్దరు అనొచ్చు. ఏమయితేనేం ఇది జరుగుతున్న మాట సత్యం. దీని ఫలితం ఆదివాసీ హననం. ఒక సంవత్సర కాలంలోనే ఒక్క దంతెవాడ జిల్లాలోనే ఈ హత్యాకాండలో 500 ప్రాణాల దాక పోయాయి. అందులో 95 శాతం మంది స్థానిక ఆదివాసులే.
-బాలగోపాల్.