Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అలాగే ఇండియాలో కూడా పేదరికం అంటరానితనం, కులం అనే బానిస సంకెళ్ళు పోవాలి. అమెరికాలో నీగ్రోల బానిసత్వంలాగా, అక్కడ నీగ్రోల బానిసత్వం పోయింది. అందరూ సమానమే అని నిరూపించబడింది. అందరు సమానం కాబట్టే ఆ దేశం అభివృద్ధి చెందింది. ఇక్కడ పేదరికం ఉన్నచోటే అంటరానితనం అంటే కులం. అందుకే కులం అనే భూతం భూస్థాపితం అయితే పేదరికం పోతుంది. అందరూ సమానం అనే భావన వస్తుంది. అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. భారతదేశానికి పూర్వ వైభవం రావాలి. సింధు నాగరికత రోజులలో భారతదేశం నెం.1గా ఉండేది. అప్పుడు కులాలు లేవు, మధ్యలో వచ్చిన కులాల వల్ల పేదరికం వచ్చింది. కాబట్టి కులనిర్మూలన జరిగితే పేదరికం పోతుంది. భారతదేశం మళ్ళీ సిరిసంపదలు సృష్టించి అభివృద్ధిలో సాగుతుంది అని నా నమ్మకం.....
రాజారావు