భారతీయ సంప్రదాయంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న స్తోత్రాలలో ఆదిత్య హృదయం ఒకటి.
రావణుణ్ణి ఎలా సంహరించాలి అని రాముడు ఆలోచిస్తున్నాడు. రాముడి పరిస్థితిని గమనించిన అగస్త్యుడు అతని సమీపానికి వచ్చి అతనికి విజయాన్ని చేకూర్చే సాధనంగా ఆదిత్య హృదయం అనే ఉపాసనను రాముడికి బోధిస్తాడు.
రాముడు ఈ స్తోత్రాన్ని మూడు సార్లు మననం చేసి ఉత్సాహ పూరితుడై ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రావణుణ్ణి సంహరిస్తాడు. విజయాన్ని సాధించే సాధనంగా ఈ స్తోత్రం ప్రసిద్ధి కెక్కింది.
- డా. కె. అరవింద రావు