Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


OUT OF STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹700

తమిళ ప్రాంతం

భక్తి అన్నది తలుపులు మూసుకుని తమకు తామే జరుపుకునే ఒక రహస్య ప్రక్రియలాగ, లేదా బహిరంగంగా అయితే పూజారుల పేరుతో వారి అధీనంలో జరగాల్సిన ప్రక్రియలాగ తయారుకావడంతో బౌద్ధం జైనం ప్రజలకు దగ్గరవుతున్న కాలం అది. బౌద్ధానికి, జైనానికి రాజుల అండదండలు కూడా తోడవటంతో ప్రజలో అసంతృప్తి మొదలయింది. దానిని ఎదుర్కొనేందుకు 'భక్తి ఉద్యమం' ఒక సంస్కరణ ఉద్యమంలా ముందుకొచ్చింది.

సంగం కాలం తరువాత పశ్చిమ దక్కనీ ప్రాంతంలో చాళుక్యులు, కాంచీలోని పల్లవులు, మదురైలో పాండ్యులు (పల్లవ పాండ్య రాజ్యాలు పూర్తిగా తమిళ ప్రాంతంలోనివి) ఆరవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకూ ఒకరితో ఒకరు యుదాలు చేసుకుంటూ దక్షిణ ప్రాంతంలో వారి వారి రాజ్య విస్తీర్ణాల్ని, ప్రాబల్యాల్ని పెంచుకుంటూపోయారు.

ఎనిమిదవ శతాబ్దం మధ్య భాగానికి రాష్ట్రకూటులు బదామీ చాళుక్యుల్ని ఓడించి బదామీ చాళిక్యుల సామ్రాజ్యాన్ని వారి అధీనంలోకి తెచ్చుకున్నారు. కాలంతోపాటే సంగం కాలపునాటి దేవుళ్లు కూడా రూపాంతరం చెందారు. అప్పటి మాయన్ 'విష్ణువు'గా, కురింజి పర్వతాల్లోని శివుని కుమారుడు 'మురుగన్ స్కంద' లేదా 'సుబ్రమణ్యుడు'గా, విజయదేవతగా పూజలందుకున్న కొర్రవై (మురుగన్ తల్లి) శివుని భార్యగా చూడబడింది. అనేక శైవ వైష్ణవ దేవాలయాలు నిర్మాణమయ్యాయి. జైనుల్ని, బౌద్దుల్ని తరిమేసే ప్రయత్నాలు అన్ని వైపులనుండి ముమ్మరంగా సాగాయి. ప్రముఖ శివభక్తుడైన అప్పార్, మొదటి మహేంద్రవర్మన్ (580-630) రాజును జైనం నుండి శైవంలోకి తీసుకురాగలిగాడు.

భక్తి ఉద్యమం పరిధిలో సంప్రదాయవాదులు, బ్రాహ్మణులు, శూద్రులు, దళితులు, స్త్రీలు అందరూ చేరారు. అది దాదాపు 6వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకూ విస్తరించింది. 6-9 శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశంలో రెండు ధార్మిక ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి. శైవారాధకులైన అరవై మూడు మంది 'నాయనార్లు', వైష్ణవారాధకులైన పన్నెండు మంది 'ఆళ్వార్లు' వారివారి ఆరాధకుల పేరు మీద ఉద్యమాలు తీసుకొచ్చారు.

ఈ ఉద్యమాలో మొటమొదటిసారిగా అప్పటివరకూ అణచివేయయబడ కులాలవాళు | కూడా ఉండటం విశేషం. ఈ రెండు ఉద్యమాలూ బౌద్ధం, జైనానికి విరుద్ధంగా పనిచేసాయి. సంగమ సాహిత్యంలోని ప్రేమాశౌర్యాలకు, భక్తి విలువల్ని జోడించిన ఆదర్శాల్ని వారు ప్రతిపాదికగా చేసుకున్నారు. సంగమ సాహిత్యంలో శివ, మురుగ, తిరుమల్ ప్రస్తావనలు కనిపిస్తాయి. కానీ ఆ తరువాత భక్తి ఉద్యమ కాలంలో శివుని ప్రాముఖ్యత ఎక్కువగానే ఉన్నా శైవం, వైష్ణవం అంటూ ఏదో ఒకే రూపాన్ని మాత్రమే ఆ ఉద్యమం తీసుకోలేదు. భక్తి కవులు వారు నమ్ముకున్న దైవాలను శృతిబద్దంగా స్తుతిస్తూ గ్రామ గ్రామాలకు తిరుగుతూ ప్రజలను 'శైవం, వైష్ణవం రెండింటిలోకి వారు తీసుకురాగలిగారు. ధనికులు, వర్తకులు, నైపుణ్యం గల

అదే.................