Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

శ్రీరస్తు.

అభినయ దర్పణమ్.

ఇష్ట దేవతా ప్రార్థనా శ్లో. అఖికం భువనం యస్య వాచికం సర్వవాఙ్మయమ్, ఆహార్యం చన్హతారాది తం వందే సాత్త్వికం శివమ్. 1

తా. ఎవనికి భువనము ఆంగికాభినయమో, వాగ్రూపము లైనవి యెల్ల నెవనికి వాచికాభినయమో, చంద్ర తారాదులు ఎవనికి ఆహార్యాభినయ మో, అటువంటి సత్త్వ ప్రధానుఁడగు శివునికి నమస్కరించెదను. ఇప్ప ఉవాచ:

కళ్యాణాచలవాసాయ కరుణారససింధవే, నమోస్తు నంది కేశాయ నాట్యశాస్త్రార్థ దాయినే -2

తా. ఇంద్రుడు:- కైలాసపర్వత నిలయుఁడును, దయాసముద్రుఁ డును, నాట్యశాస్త్రం ప్రదుఁడు నైన నందికేశ్వరునికి నమస్కరించెదను. సద్ది కేశ్వర ఉవాచ:

స్వాగతం తే సురాధీశ కుశలం త్రిది వొకసామ్, కిమర్థమాగతం బ్రూహి భవతా మమ సన్నిధౌ.

తా, నంది కేశ్వరుఁడు: ఓయింద్రుఁడా! నీకు స్వాగతము. స్వర్గ వాసులందరికిని చేదుమా? నీరాకకు కారణ మేమి?..........