"ఇండియా లిప్స్ ఇన్ విలేజెస్"... గ్రామాలన్నీ అభివృద్ధి చెందితే ఓ మండలం, మండలాలన్నీ అభివృద్ధి చెందితే ఓ జిల్లా, జిల్లాలన్నీ అభివృద్ధి చెందితే ఓ రాష్ట్రం, రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితే ఓ దేశం.... సర్వోతోముఖాభివృద్ది చెందుతుందని మనస్ఫూర్తిగా విశ్వసించిన ఓ అభ్యుదయ వ్యక్తి, హృదయతరంగంలో జరిగిన అంతర్మధనంతో వెల్లుబికిన భావాల సమూహమాల, ఈ ఆశయం.
అమెరికాలో పుట్టి, అక్కడే పెరిగి, తండ్రి ఆశయ సాధనకోసం మన దేశానికీ వచ్చి, ఇక్కడి పరిస్థితులను సమగ్ర అధ్యయనం చేసి, వాటి పై పరిపూర్ణ అవగాహనా పెంచుకుని, పక్కా ప్రణాళికను తయారు చేసుకొని, పకడ్బందీగా అమలు పరిచి, అకుంఠిత దీక్షతో, సడలని పట్టుదలతో, స్వగ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేసి, రాష్ట్రంలోనే ఒక ఉత్తమ గ్రామంగా, ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన ఓ ధీరోదాత్తుడైన యువకుడి విజయ గథా, ఈ 'ఆశయం'.
ప్రస్తుతం గ్రామాల్లో వున్నా రుగ్మతలకు, ఈ 'ఆశయం', ఓ సంజీవిని అని చెప్పలేము కాని, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలనుకునే వారికీ, నిస్సందేహంగా ఓ దీక్షుచిలా ఉపయోగపడుతుంది ఈ ఆశయం.
- తోట సాంబశివరావు