Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹60

ముందుమాట

క్రోధ భట్టారకుడు అనేటటువంటి మహర్షి అనసూయ అత్రి అనే దంపతులకు రుద్రుని అంశగా జన్మించాడు. ఈయన దుర్వాసమహర్షిగా మనకు అందరికి తెలిసిన మహర్షి. ఈ మహర్షి అత్యంత శక్తివంతమైన మూడు గ్రంథాలను రచించినాడు. అవి 1.శ్రీ దేవీ మహిమ్నా స్తోత్రము, 2. శ్రీ పరశంభు మహిమ్నాస్తుతి, 3. శ్రీ లలితాస్తవ రత్నము అనేవి ఈ మూడు గ్రంథములు. వీటిలో శ్రీ లలితా స్తవరత్నము అనే గ్రంథమును ఆర్యా అనే ఛందస్సులో వ్రాయడం చేతను, (శతకము అనగా వంద సంఖ్య కలది) ద్వి శతము అనగా రెండు వందలు గలది అగుట చేతను దీనిని పండితులు ఆరాద్విశతి అని వ్యవహరించినారు. ఈ ఆర్యా ద్విశతి అను గ్రంథమునందు, 213 శ్లోకములు ఉన్నవి. ఇందులో శ్రీదేవీ నగరాన్ని (మణిద్వీపవర్ణనం) వర్ణించడం జరిగినది. ఇది మన అందరకూ నిత్య పారాయణ గ్రంథము.

ఈ గ్రంథాన్ని నిత్యము పారాయణ చేయడం వలన సర్వ కోరికలు సత్వరమే సిద్ధిస్తాయి. ఆస్తికలోకం ఈ స్తోత్రమును పారాయణ చేసి ఇహపర సౌఖ్యములు పొందుదురు గాక అని కోరుకుంటూ..........