ఒక రోజున శ్రీ మహావిష్ణువు తన శిష్యునితో సహా కొండ గుహలో ధ్యానిస్తూ కూచున్నట్లు కథ చెప్తారు" అని మొదలెట్టాడు మిత్రశ్రీ.
ధ్యానం పూర్తయిన తర్వాత శిష్యుని హృదయం, తనకు లభించిన అపూర్వ శాంతిని గుర్తించి ఆర్ద్రతతో నిండిపోయింది. విష్ణువు పాదాల మీద పడి తన రుణం తీర్చుకోవడానికి ఎదో ఒక రకమైన సేవ స్వీకరించామాని కోరాడు.
విష్ణువు చిరునవ్వుతో తల అడ్డం తిప్పాడు. "నేను నీకు ఉచితంగా ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలుపడానికి క్రియాత్మకంగా ఏమిచేయలేవు" అన్నాడు.
మనందరి జీవితాల్లాగానే ఆ శిష్యుడి జీవితం కూడా స్వాపనిక జీవితం. అహంతో సాగిపోతూ వున్నటువంటిది. "మీరు నాకింత చేశారు కాబట్టి , నేను మీకేదైనా చేయనిశ్చయించుకున్నాను" అనడంలోనే మనిషి అహం కనిపిస్తుంటుంది. శిష్యుడు తన అహాన్ని కనక వదిలేసి వుంటే - కృతజ్ఞత ప్రకటించే మనిషి కానీ, ఏదైనా తిరిగి ఇవ్వడానికి కానీ - అక్కడ" ఎవరు లేరని నిశ్శబ్దం మాత్రమే వుందని అనిపించేదేమో! ఆ శ్రీమహావిష్ణువు ఒక సంపూర్ణ నిశ్శబ్దం. అహం వీడిన ఈ శిష్యుని నిశ్శబ్దం ఆ మహానిశ్శబ్దంలో కలిసిపోయివుండేది.