Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹30

75 సంవత్సరాల స్వతంత్ర్యోద్యమం

- సీతారాం ఏచూరి

భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో రాజ్యాంగబద్ధమైన లౌకిక ప్రజాతంత్ర భారతాన్ని హైందవ ఫాసిస్టు రాజ్యంగా మార్చటానికి కావల్సిన రీతిలో దేశం గురించి సరికొత్తగా వ్యాఖ్యానించటం ముమ్మరంగా సాగుతోంది. ఈ సరికొత్త వ్యాఖ్యానం చారిత్రాత్మక భారత స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి, రాజ్యాంగ చట్రం ద్వారా నిర్మితమైన భారతానికి పూర్తి భిన్నమైనది.

ఈ సరికొత్త వ్యాఖ్యాతలు చెప్పేదాని ప్రకారం భారతదేశానికి బ్రిటిష్ వాళ్ల నుండి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినా రాజ్యాంగంలోని 370, 359 అధికరణాలు రద్దు చేసి, ఓ రాష్ట్రంగా జమ్ము కాశ్మీర్ కు ఉన్న గుర్తింపును తుడిచేసిన 2019 ఆగస్టు 5వ తేదీన మాత్రమే అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని చెప్తున్నారు. ఆగస్టు 5, 2020న రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగినప్పుడు మాత్రమే భారతదేశం తనను తాను విముక్తురాలిగా గుర్తించుకోనారంభించిందని ప్రచారం చేస్తున్నారు.

అనేక చారిత్రక వాస్తవాలను మరుగున పెట్టి, వక్రీకరించి, నిర్దేతుకమైన | సమాచారం ఆధారంగా, చరిత్రలో నిరూపణకు నిలవని వాదనల ఆధారంగానే ఈ | తప్పుడు వ్యాఖ్యానం రూపుదిద్దుకుంటోంది. భారత జాతీయత, స్వాతంత్ర్యోద్యమంలో ఆరెస్సెస్ పాత్ర, వంటి అనేక అంశాలకు సంబంధించిన పుక్కిటి పురాణాలు ఈ.......................