Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹600

                                                                                                                                                    వేదం-జీవన నాదం
           మానవులందరూ వేదమును చదువవచ్చును

ఓం యథేమాం వాచం కళ్యాణీ మావదాని జనేభ్యః |

                 బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ స్వాయ చారణాయ || యజు. 26.2 , పరమేశ్వరుడు ఇట్లు ఉపదేశించున్నాడు. ఓ మానవులారా ! నేను ఎట్లు ఈ సమస్త మానవులకొరకు సంసార సుఖమును, ముక్తి జ్ఞానమును ప్రసాదించునట్టి కళ్యాణ ప్రదమగు ఋగ్వేదాది చతుర్వేదవాణిని ఉపదేశించుచున్నానో అటులనే మీరును ఈ చతుర్వేదాలను సంపూర్ణంగా , అధ్యయనం చేసి అందరికీ ఉపదేశింపుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, , శూద్ర, అతిశూద్రులకును, వారి సేవకులకును, అన్ని వర్ణముల స్త్రీలకును, అనగా మానవులందరికినీ ఈ నాలుగు వేదాలను ప్రసాదించితిని. అనగా, మానవులందరు కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గాది భేదాలు లేకుండా, వేదాలను చదువుచు- చదివించుచు, వినుచు- వినిపించుచు జ్ఞాన విజ్ఞానాలను వృద్ధిపరచుకొంటూ సదా దుఃఖాల నుండి దూరులై , అమృతానందాన్ని పొందుదురుగాక !