భారతదేశ చరిత్రలో 19 వ శతాబ్దం చాలా కీలమైనది. అదొక సంధికాలం . పరివర్తనా కాలం. భారత ప్రజలకు, కంపెనీ పాలకులకు కూడా కీలక దశ. వలస పాలకుల పరిపాలనా విధానాల వలన నూతన సామాజిక, రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. సామజిక అపసవ్యతలు, జాతీయ విపణి నెలకొనడం, పెట్టుబడిదారీ వ్యవస్థను భారతదేశం మీద రుద్దడం, సాంస్కృతికంగా మార్పులు రావడం నూతన విధానాల ఫలితమే!