Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

విలియమ్ డాప్రియాంపుల్ (william Daviample) అనే చరిత్రకారుడు తాను రాసిన "అరాచకం" (The Anarchy - The East India - company - corporate violence and the pillage of an Empire) అనే గ్రంధంలో ఇలా అంటాడు -

“ మనం ఇప్పటికీ బ్రిటీష్ వారు భారత దేశాన్ని జయించడం అనే మాటను వాడుతూవుంటాం. అది అర్థంకానిమాట. పద్దెనిమిదో శతాబ్దపు మధ్యనుండి, క్రమక్రమంగా భారతదేశాన్ని ఆక్రమించుకున్నది బ్రిటిష్ వారు కాదు. .

అందుకు కారకులు - ఏ విధమయిన నియమనిబంధనలూ లేని, ఒక ప్రయివేట్ కంపెనీ ప్రధాన కారకుడు - ఏ విధమగు దయాదాక్షిణ్యాలు లేని, దోచుకోవడమే స్వభావం గల రాబర్ట్ క్లయివ్-”

ఈ మాటలలో ఏ విధమగు అసత్యమూ లేదు.

ఇంగ్లాండ్ సామ్రాజ్జి ఎలిజిబెత్ 1600 సం|| డిసెంబరు 31 వ తేదీన - కొందరు ప్రయివేట్ వ్యక్తులు వాటాదారులుగా వున్న 'ఈస్ట్ ఇండియా కంపెనీ' అనే

జాయంట్ స్టాక్ కంపెనీకి 'రాయల్ ఛార్టర్' ఇవ్వడం. అది, ప్రపంచ పటంలో అనేక మార్పులు వచ్చాయి. చిన్న దేశమయిన ఇంగ్లాండ్, కాలగమనంలో రవి అస్తమించని రాజ్యంగా మారిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు, 'ఈస్ట్ ఇండియా కంపెనీ' గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

ఇది బ్రిటిష్ పార్లమెంట్ లో గొప్ప పలుకుబడి గల సంస్థ. దీనికి ఒక కారణం - బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ఇందులో వాటాదారులుగా వుండడం. రెండో కారణం - మంత్రులను, రాజకీయవేత్తలను, లంచాలిచ్చి 'మంచి' చేసుకోవడంలో ఈ కంపెనీకి విశేష ప్రావీణ్యం' వుండడం.