Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

                               మన తెలుగు బాష మనకి కాకుండాపోతోంది. మిగతా భాషలు మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్రతకడానికి , ఉద్యోగాలకి ఉపయోగపడతాయి. అయినా మన మాతృబాషని మనం వదలకూడదు . అమ్మ అంటే మనకి ఎంత గౌరవమో, ఎంత మార్యదో మాతృబాష మీద కూడా  అంతే ఉండాలి. వేరే భాషల్లో  పుస్తకాలు చదవద్దని కాదు, జ్ఞానం కావాలంటే అన్ని రకాల పుస్తకాలు చదవాలి. అసలు చదువుకి, విద్యకి చాలా తేడా వుంది, చదువు బ్రతుకు తెరువుకి, తినడానికి , బట్ట కట్టడానికి, ఉండడానికి ఒక గూడు కోసం, కానీ విద్య జ్ఞానాన్ని యిస్తుంది. బ్రతకడం నేర్పుతుంది. మనం మనకోసం బ్రతుకుతూ ఇతరుల కోసం బ్రతకడం కూడా నేర్పిస్తుంది. పెద్దలంటే భక్తి, వినయం , దేవభక్తి అన్ని సుగుణాలను నేర్పుతుంది. మంచి పనులు చేయడం, న్యాయంగా , ధర్మంగా ఎలా ఉండాలి అనేది క్లాసుపుస్తకల వల్లరాదు. మంచి మంచి విషయాలు పెద్ద వాళ్ళు మనకోసం ఎంతో కస్టపడి పుస్తకరూపంలో పొందుపరచి వుంచారు, అవి చదవడం మొదలు పెడితే ఎటువంటి సమస్యలకైన పరిష్కారం తెలుసుకోగలుగుతాం.